కాజల్ అగర్వాల్ (kajal aggarwal).. లక్ష్మీ కల్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు కేవలం తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, హిందీ వంటి భాషల్లోనూ అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సాధించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పన్నెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ తన టాప్ స్థానాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది కాజల్. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించడంతో పాటు అవార్డులు కూడా సాధించింది కాజల్. ఇప్పుడు ఆమె సాధించిన ఘనతల జాబితాలో మరో ముఖ్యమైన విషయం కూడా చేరింది. కేవలం అదే కాదు.. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దక్షణాది కథానాయికగా కూడా పేరు సాధించింది కాజల్.. ఆ ఘనత ఏంటి అనుకుంటున్నారా?
ఈ మోడ్రన్ సీతతో అంత వీజీ కాదండోయ్..ఎందుకంటే తను శూర్ఫణక లాంటిది!
సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ (madame tussauds) మ్యూజియం లో కాజల్ మైనపు శిల్పం ఏర్పాటు కానుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని తనకు అందించిన మేడమ్ టుస్సాడ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తన చిన్నతనంలో ఒకసారి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి వెళ్లాలని.. అక్కడి మైనపు విగ్రహాలు చూసి ఎంతగానో ఆకర్షితురాలినయ్యానని చెప్పుకొచ్చింది కాజల్. వాటిని ఆరాధించడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది కాజల్. ఇప్పుడు ఆ మైనపు విగ్రహాల మధ్యే తన విగ్రహం కూడా ఉంటుందని ఊహించుకుంటేనే మైమరచిపోతున్నానని చెబుతోందీ అందాల భామ.
ప్రస్తుతానికి మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు కాజల్ శరీర కొలతలతో పాటు ఆమె కంటి, జుట్టు రంగులు, చర్మ ఛాయ వంటి వాటి కొలతలన్నీ తీసుకొని వెళ్లారు. కాజల్ విగ్రహం రూపొందడానికి మరో నెల రోజులు పడుతుంది. అందుకే ఈ విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కూడా కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించింది. నేను, నాలో మరో భాగం సింగపూర్ లో ఫిబ్రవరి 5, 2020న మిమ్మల్ని కలుసుకుంటాం అంటూ పోస్ట్ చేసింది. మేడమ్ టుస్సాడ్స్ లో భాగం కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన కాజల్ దీని వెనుక ఉన్న తన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. దీనికి సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది కాజల్. ఈ గౌరవం దక్కడం ఎంతో ఉన్నతంగా అనిపిస్తోంది. కొత్త దశాబ్ధాన్ని ప్రారంభించేందుకు ఇంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. గంటల తరబడి.. రాత్రీపగలూ పనిచేయడం.. పని లో అన్నీ మర్చిపోవడం వంటివన్నింటికీ దక్కిన గౌరవం ఇది. నా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడం, కుటుంబ సభ్యులతో గడపలేకపోయిన ఆ సమయానికి ప్రతీక ఇది. నన్ను ఈ స్థాయి వరకూ చేరుకునేలా ప్రోత్సహించిన నా అభిమానులకు ధన్యవాదాలు. ఇది మీ ప్రతి ఒక్కరి వల్లే జరిగింది. అంటూ పోస్ట్ పెట్టింది.
లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోన్న.. అందాల చందమామ కాజల్ అగర్వాల్..!
టాలీవుడ్ లో ఇలాంటి గుర్తింపు సాధించిన మొదటి నటి కాజల్ అని చెప్పుకోవచ్చు. గతంలో బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కి, తాజాగా ఈ సంవత్సరం తొలినాళ్లలో మహేష్ బాబు కి ఈ గౌరవం దక్కింది. మహేష్ బాబు మైనపు విగ్రహం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లోనే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాజల్ కి ఈ ఘనత దక్కడం తో ఆమె స్థాయి మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్యారిస్ ప్యారిస్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కాజల్ ఆ తర్వాత మోసగాళ్లు అనే తెలుగు, ఇంగ్లిష్ చిత్రంతో పాటు ముంబై సాగా అనే హిందీ సినిమా, కమల్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాల్లోనూ కాజల్ కథానాయికగా కనిపించనుంది.
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్ ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.